రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని మేం ఆడిగామా? అని అస్సాం సీఎం అంటే.. కాంగ్రెస్ పార్టీగా నేను అస్సాం సీఎంకి ఎంత మంది తండ్రులని అడగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగామాట్లాడడు.. అసలు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ విరిచుకుపడ్డారు.
Read Also: Statue Of Equality: ప్రపంచంలో ఇది ఎనిమిదో అద్భుతం..
రాహుల్ గాంధీ తండ్రి గురించి నువ్వు మాట్లాడిన్నపుడు మేం నీ తండ్రి గురించి అంటే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.. అమిత్ షాకి తండ్రి ఒక్కడేనా అని కాంగ్రెస్ పార్టీ అంటే మీకు బాధగా ఉంటుందా లేదా…? అని మండిపడ్డ ఆయన.. మోడీకి తండ్రి ఒక్కడేనా అని కాంగ్రెస్ పార్టీ అంటే మీకు బాధగా ఉంటుందా లేదా…? అని నిలదీశారు.. అస్సాం సీఎంకి 10 మంది తండ్రుల అని కాంగ్రెస్ పార్ట్ అంటే బాధ కలుగుతుందా లేదా..? అని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. ఇంత తెలివి లేని సీఎంని బీజేపీ సమర్థిస్తుందంటే బీజేపీ నాయకులంతా మూర్ఖులు ఎవరు ఉండరన్నారు.. అస్సాం సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్న ఆయన.. ఇలాంటి మూర్ఖత్వ మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన తెచ్చిన స్వతంత్ర దేశంలో మీరంతా సీఎంలు అయ్యారు.. ఇలాంటి మాటలు మాట్లాడి బీజేపీ నాయకులు దిగజారోద్దు అన్నారు. లేదంటే మేం దీనికి తగ్గట్లు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు జగ్గారెడ్డి.
