హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న అసోం సీఎం హేమంత్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. గణేష్ నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నేతలు.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గణపతి నిమజ్జనంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని స్పష్టం చేసిన ఆయన.. నిమజ్జనానికి వచ్చిన హేమంత్ బిస్వాల్.. రాజకీయం మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. రాజకీయాలు ఉంటే పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకోవాలి… తెలంగాణ సీఎం కేసీఆర్‌ని తిట్టాలి అనుకుంటే సభలు పెట్టి మరీ తిట్టండి కానీ.. గణపతి నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడి బిస్వాల్ తప్పు చేశారని ఫైర్ అయ్యారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.. టీఆర్ఎస్ కార్యకర్త న్యాయంగా ప్రవర్తించారంటూ సపోర్ట్ చేశారు వీహెచ్.
Read Also: Twist in Sai Priya Missing Case: సాయిప్రియ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ప్రియుడే చంపి పూడ్చేశాడు..!
నిమజ్జనానికి అన్ని పార్టీల నాయకులు వస్తారు.. కానీ, బీజేపీకి కేవలం ఓట్ల రాజకీయం కావాలంటూ దుయ్యబట్టారు వీహెచ్.. కేసీఆర్‌ని సభలు పెట్టి తిట్టు.. కానీ, గణేష్ నిమజ్జనంలో అనడం సరికాదన్న ఆయన.. విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవుపలికారు. మరోవైపు.. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేస్తే.. రాహుల్ గాంధీ భారత్ జోడో అని యాత్ర చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు వీహెచ్.. బీజేపీ నేతలు భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక, రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడు కావాలని ఆకాక్షించారు.. జోడో యాత్రలో బడుగు, బలహీన వర్గాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.. రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది.. వచ్చే ఎన్నికల్లో సెక్యులర్ ఫోర్స్ ని ఏకం చేయాలని సూచించారు. మరో ఇస్ట్ ఇండియా కంపెనీలా దేశాన్ని బీజేపీ మార్చుతుందంటూ ఫైర్ అయ్యారు వి. హనుమంతరావు.