NTV Telugu Site icon

కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్‌రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ కలుపుకుపోవాలని సూచించారు.. నేను ఆయనతో మాట్లాడతా.. కోమటిరెడ్డి బ్రదర్స్ తో మాట్లాడే బాధ్యత పార్టీ నాకు అప్పగించిందన్నారు.

Read Also: ఏపీ సచివాలయం.. ఉద్యోగుల హాజరుపై సర్కార్‌ సీరియస్‌

ఇక, దళిత బంధు మొదలు పెట్టిన శాలపల్లిలో కూడా కేసీఆర్ కు తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు వీహెచ్.. కేసీఆర్ ఇప్పటికైనా ప్రతిపక్షాల సలహాలు పాటించాలని సూచించిన ఆయన.. ప్రగతి భవన్‌లో ప్రజలను కలవు అన్నారు.. ఈటల గెలుపును తమ గెలుపని బీజేపీ సంకలు గుద్దుకుంటోంది.. మరి, ధరలు తగ్గించడానికి ఈటల రాజేందర్ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. మరోవైపు, అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడాన్ని నిరసిస్తూ నవెంబర్ 14నుంచి ఊరూరా తిరుగుతా అని ప్రకటించారు వీహెచ్‌. రైతు బంధును వెంటనే కొనసాగించాలి.. బీసీ బంధు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.