Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో అన్ని ఇండ్లకు నీళ్లు పోయాయని ఆవేదన వ్యక్తి చేశారు. రోమ్ నగరం తగలపడుతుంటే ఆ రాజు పిడేల్ వాయించారు అంటా..! ఎట్లుంది కేసీఆర్ వ్యవహారం అంటూ వ్యంగాస్త్రం వేశారు. ప్రగతి భవన్ దాటి ..మేము ఉన్నాం అని కూడా ఆదుకునే మాటలు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల తర్వాత… కేబినెట్ పెట్టుకున్నారు. రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు. మేము రైతులను ఆదుకోండి అని డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్ పక్క రాష్ట్రం నుండి నాయకులను విమానంలో రప్పించి గులాబీ కండువా కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లకి కూడా పోలేదని అన్నారు. రేపటి ఎన్నికల కోసం ఏం తాయిలాలు ఇవ్వాలి అనేదే తప్పితే… వేరే సోయి లేదు కేసీఆర్ కి అంటూ నిప్పులు చెరిగారు. క్షేత్ర స్థాయిలో రైతుల పరిస్థితి ఏంటో మంత్రులు చూస్తే అర్థం అవుతోందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు.. ఇప్పటికి చేయలేదని మండిపడ్డారు. దిక్కులేక ప్రయివేటు వ్యక్తుల నుండి అప్పులు తెచ్చుకుంటున్నారు రైతులు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ లో మేము పెట్టిన డిమాండ్లకు ఆమోదం చెప్పాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని అన్నారు. లేదంటే.. కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని, మంత్రులను అడ్డుకుంటామన్నారు.
India Per Capita Income: 2030 సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 4 వేల డాలర్లు, ఎలా?