NTV Telugu Site icon

Jagga Reddy: రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ భవన్ అటెండర్ పదవి ఇచ్చిన చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న పదేళ్లలో పీసీసీ అవుతానని.. సీఎం కూడా అవుతానన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఢిల్లీలో కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏది చెప్తే జగ్గారెడ్డి అది ఫాలో అవుతారన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. నేనేం పైరవీలు చేయట్లేదని.. ఎవ్వరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందన్నారు.

అధికారంలోనే ఉంటేనే బీజేపీకి పవర్ అని.. పర్మినెంట్ పవర్ కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉందని, బీజేపీకి చరిత్ర లేదన్నారు. మోడీది తాత్కాలిలిక పవర్ అని.. మోడీ ఉన్నంత వరకే బీజేపీ అని.. పవర్ దిగిపోతే మోడీని ఎవ్వరు పట్టించుకోరన్నారు. మళ్ళీ మోడీ పవర్‌లోకి రారని జగ్గారెడ్డి అన్నారు. యాభై ఏళ్ల కింద ఎమర్జెన్సీ గురించి ప్రస్తావన పార్లమెంట్‌లో మోడీ, స్పీకర్ తీసుకురావాల్సిన అవసరముందా అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ ఒక్క ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే మేము వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతామన్నారు. పదేళ్ల మోడీ పాలన రోజూ ఎమర్జెన్సీనే కదా అంటూ విమర్శించారు.

Read Also: Komatireddy Rajagopal Reddy: చర్లగూడెం ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగి 2వేలమంది చనిపోయారని.. మోడీ అధికారంలో ఉన్నప్పుడు పుల్వామా ఘటన జరిగిందన్నారు. పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో చర్చించే దమ్ము మోడీకి, స్పీకర్ కు ఉందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఎమర్జెన్సీలో బీజేపీ పార్టీనే లేదన్నారు. ఆరోజు జనతా పార్టీలో ఉన్న వాజ్‌పేయ్ ఇందిరా గాంధీని దుర్గామాతతో పోల్చారన్నారు. పార్లమెంటులో ఎందుకు చర్చించరు, చర్చకు సిద్ధమా అని మోడీని అడుగుతున్నామన్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని బ్యాంక్‌లను జాతీయం చేసింది ఇందిరా గాంధీ కాదా అంటూ వ్యాఖ్యానించారు. లోక్ సభలో స్పీకర్ ఎందుకు చర్చకు తీసుకురాలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందన్నారు. చైనా ఆక్రమించిన భారత్ భూభాగాన్ని ఇందిరా గాంధీ యుద్ధం చేసి విడిపించిందన్నారు. పార్లమెంట్‌లో ఎందుకు చర్చ చేయట్లేదు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుందని.. చర్చకు మోడీ, స్పీకర్ సిద్ధమా అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు.