TPCC Mahesh Goud : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు. కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్లతో సాధ్యమైందని మహేష్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు కూడా దొంగ ఓట్లతో గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు. బిసిల గురించి మాట్లాడడానికి బండి సంజయ్ ఢిల్లీకి పారిపోయారని, రాష్ట్ర సమస్యలపై స్పందించడం లేదని మండిపడ్డారు.
CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తెస్తాం.. సీఎం రేవంత్ ప్రకటన..
బీఆర్ఎస్ మూడు ముక్కలుగా చీలిపోయిందని, త్వరలో నాలుగో ముక్క కూడా బయటకు వస్తుందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ తప్ప వేరే పార్టీకి అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గకుండా గెలిచి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనహిత పాదయాత్ర ప్రజల భవిష్యత్తు కోసం చేపట్టినదని, వారి సంతోషాలు, కష్టాలను పంచుకోవడమే లక్ష్యమని మహేష్ గౌడ్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పదేళ్లలో ఇవ్వలేకపోయిందని, అయితే కాంగ్రెస్ ఏడాదిలోపే ఇళ్లు సిద్ధం చేస్తోందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రజల మద్దతుతో కాకుండా దొంగ నోట్లతో అధికారంలోకి వచ్చారని మహేష్ గౌడ్ విమర్శించారు. కులం, మతం, దేవుడు పేరుతో ఓట్లు అడగడం బీజేపీ అలవాటు అని, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదని చెప్పారు.
