KTR Tweet: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు.. కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మూడు రోజుల బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని తెలిపారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని తెలిపారు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని ట్విటర్ ద్వారా మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ..ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదన్నారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్., కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? అని ప్రశ్నించారు కేటీఆర్. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను.. కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి..అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమైందని తెలిపారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ అన్నారు. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంత్ అని ఆగ్రహం వ్యాఖ్యలు చేశారు. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని అన్నారు. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందన్నారు. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని అన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
Telangana Weather: నవంబర్ వరకు మండనున్న ఎండలు.. ఆ తర్వాతే చలి వాతావరణం
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!