Pooja Hegde: ప్రస్తుతం సినీ ప్రపంచంలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న నటీనటులు చిన్నప్పుటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు తీసిన పాత ఫోటోలను చూసి వాళ్ల అభిమానులు అబ్బుర పడిపోతున్నారు. ప్రస్తుతం నటి పూజా హెగ్డే స్కూల్, కాలేజీలో చదువుతున్నప్పుడు తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Read Also: Crime News: దారుణం.. పట్టపగలే తుపాకీతో మహిళను బెదిరించి మరీ..
హీరోయిన్ పూజా హెగ్డే.. తమిళంలో జీవా హీరోగా నటించిన మాస్క్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పూజ కెరీర్ కు ఏమాత్రం సహకరించలేదు. సినిమా ప్లాప్ కావడంతో అవకాశాలను అందుకోలేకపోయింది. దాంతో అమ్మడి దృష్టి తెలుగు తెరపై పడింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తెలుగులో తన అందం, టాలెంట్ చూపిస్తూ ప్రస్తుతం టాప్ హీరోయిగా ఎదిగింది. తమిళ్లంలో చాలా గ్యాప్ తర్వాత, విజయ్ బీస్ట్ (మృగం) లో నటించినా అది కూడా విజయం సాధించలేకపోయింది.
దీంతో నటి పూజా హెగ్డే తమిళ చిత్రసీమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోలేక నేటికీ కష్టాల్లోనే ఉంది. ఈ స్థితిలో నటి పూజా హెగ్డే తన స్కూల్ ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న పాత ఫోటో ఓ వెబ్‌సైట్‌లో షేర్ చేయబడి వైరల్ అవుతోంది. అప్పుడు హీరోయిన్లా సూపర్ సూపర్ అని, చిన్న వయసులో నటి పూజా హెగ్డే తీసిన అందమైన ఫోటోను మీరే చూడండి.. అంటూ పోస్ట్ చేసింది. దీనికి అభిమానులు భారీగా లైకులు, కామెంట్స్ ఇస్తున్నారు.