CM KCR: కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన.. బేగంపేట్ నుంచి బయలుదేరనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12.45 నిమిషాలకు అన్నబాయ్ సాటే విగ్రహానికి కేసీఆర్ నివాళ్లు అర్పించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అన్నాభావ్ సాఠే కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి.. 1.30 నిమిషాలకు ఇస్లాంపూర్ లోని రఘునాధ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సాంగ్లీ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖలతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
Read also: Hanuman Chalisa: అష్టమ పీడితులు తొలగాలంటే హనుమాన్ చాలీసా తప్పక వినండి
Also Read
కొల్హాపూర్‌లోని దేవీ అంబాబాయి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు ఆయన తిరుగు పయనం అవుతారు. అయితే, మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా అన్నాభావ్ సాఠే పేరొందారు. సాఠే వాటేగావ్‌లోనే 1920, ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నాభావ్ సాఠే అనేక రచనలు చేశారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇక, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణలోని మాంగ్ సమాజ్ ప్రజలు పాల్గొనాలని మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు గైక్వాడ్ తులసీదాస్ పిలుపునిచ్చారు.
ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
ఇక తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన 26,27 తేదీల్లో అంటే రెండు రోజులు ఉంటుంది. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షోలాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.
Esha Gupta : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!