NTV Telugu Site icon

CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన హరీష్ రావు

Harish Rao

Harish Rao

CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం సవాల్ ని నేను స్వీకరిస్తున్నా అన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నారు. ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలన్నారు. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని తెలిపారు. మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు.

Read also: Anupama Parameswaran :కన్ఫ్యూజన్ లో అనుపమ కెరీర్..తరువాత సినిమా పై రాని క్లారిటీ..

గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి అంటూ ఆరోపించారు. ఆరు గ్యారెంటిలను డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం అని మాటతప్పింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం మీ నైజం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటావా అని తొండి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారని తెలిపారు. 120 రోజులు దాటినా నీ గ్యారెంటీలు ఏమయ్యాయి అని మేము అడుగుతున్న? అని ప్రశ్నించారు.

Read also: Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా..

మహాలక్ష్మీ పథకంలో 2500 మహిళలకు ఎందుకు ఇవ్వలేదు, రైతులకు ఎకరానికి రైతు బంధు 15000 సహాయం ఇవ్వలేదు, ధాన్యానికి 500 బోనస్ ఏది..నిరుద్యోగులకు భృతి ఏదీ? అని ప్రశ్నించారు. కాగా.. నిన్న వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండని.. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అని హరీష్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ హరీష్ , సీఎం సవావ్ ను స్వీకరించడంతో పార్టీ వర్గంల్లో చర్చకు దారితీస్తోంది. మరి హరీష్ రావు సవాల్ సీఎం స్వీకరిస్తారా? ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకు సీఎం వెళతారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
Hyderabad Metro: రేపు ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..