Jana Jatara Sabha: నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన.. జనజాతర సభకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Jatara Sabha: నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబుబ్ నగర్ పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జనజాతర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో బారీ భహిరంగ సభకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Read also: TS Weather: ఈ వారం మరింత పెరగనున్న ఎండలు.. ఐఎండి అలర్ట్
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
బారీగా జనసమీకరణ చేసేందుకు ముఖ్య నేతల కార్యాచరణ చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు హాజరుకానున్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పరిధిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో జరిగిన సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 6న మహబూబ్‌నగర్‌లో భారీ సభ, ఇప్పుడు నారాయణపేటలో బహిరంగ సభ.. నారాయణపేట జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రాకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read also: Car Accident: దుండిగల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించి నామినేషన్ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే బీజేపీకి కొంత బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు మరికొందరు నేతలు కూడా సోమవారం జరిగే సమావేశంలో పార్టీలో చేరే అవకాశం ఉంది.
KCR: రేపు సంగారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!