NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జన జాతర సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ కూడలిలో ప్రసంగించనున్నారు.

Read also: Faria Abdullah : బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఫరియా..

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చి కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ వద్ద దిగిన సీఎం బీజేఆర్‌ చౌరస్తా నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించనున్నారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లాకు వస్తున్నందున భారీ స్వాగత ఏర్పాట్లకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. నియోజకవర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ కాంగ్రెస్ నాయకులతో కలిసి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డుల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Read also: Bomb Threat : ఢిల్లీ బాంబ్ బెదిరింపు ఈ మెయిల్ వచ్చిన ప్లేస్ గుర్తించిన పోలీసులు

నిన్న జరిగి సభలో బీజేపీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు పంపిన నోటీలపై ఫైర్ అయ్యారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో పోలీసులు ఉంటారు కాబట్టి ఢిల్లీ పోలీసులను ఎంచుకుంది బీజేపీ అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నన్ను అడ్డుకోవాలని బీజేపీ చూస్తుందని ఫైర్ అయ్యారు. 2017 లో హెగ్డే చేసిన కామెంట్స్ రాజ్యాంగం మార్చడానికి వచ్చామని చెప్పారన్నారు. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. ఇది నిజం అన్నారు.

Read also: India Maldives Tension: తొలిసారి భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి వచ్చేనా..?

బలహీన వర్గాలకు అండగా ఉండేది ఇండియా కూటమినే అన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగం మార్చలా.. మార్చకూడదా అనేది అజెండా అన్నారు. బడుగు..బలహీన వర్గాలు ఆలోచన చేసుకోండి అంటూ తెలిపారు. మీరు పోలీసులతో బెదిరించాలని అనుకోకండి అంటూ అమిత్ షా పై మండిపడ్డారు. ఇక్కడ ఒకాయన్ని అడగండి నేను పోలీసులకు బయపడుతానా? లేదా? అని అన్నారు. చీకట్లో ఆయన మీతో మాట్లాడుతుంటారు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అడగండి నా గురించి అన్నారు. కిషన్ రెడ్డి ఎం మాట్లాడాలో .. తెలియక అర్థం కాకుండా ఉన్నాడని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టు..ఆధాని..అంబానీ ఉన్నారని తెలిపారు. మోడీ వాళ్లకు అండగా ఉంటున్నాడని సీఎం రేవంత్‌ తెలిపారు.
Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..