టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడంతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం మిగిలిపోయింది. అలాగే ఐటమ్ సాంగ్స్ లలో కూడా మెరిస్తుంది. చిట్టి పాత్రలో అందరినీ కట్టిపడేసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తన నటన, అందానికి తగిన గుర్తింపు దక్కింది.. యూత్ ఫాలోయింగ్ పెరిగింది.. వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది..
బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. తమిళంలో సినిమాలు చేస్తోంది.. ప్రస్తుతం తెలుగులో హీరో అల్లరి నరేష్ కు జోడిగా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తుంది.. మే 3 న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.. కైపెక్కించే చూపులతో, క్యూట్ స్మైల్ తో ఉన్న ఆ ఫోటోలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..