CM Revanth Reddy : వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దుద్యాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం, భక్తులతో కలిసి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం నారాయణపేట జిల్లా అప్పకపల్లికి చేరుకున్నారు. అక్కడ బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన, పూర్తిగా మహిళలచే నడిచే పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. బంక్ నిర్వహణను పూర్తిగా మహిళలే చేపట్టడం అభినందనీయం అని, వారిని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.
Toilet Usage Management Rule: ఉద్యోగులు టాయిలెట్స్ వినియోగంపై వింత రూల్స్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని, తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు నాణ్యమైన చీరలు ఇవ్వబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రూ.1000 కోట్లతో సమాఖ్య సభ్యులకు చీరలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Allu Arjun : అట్లీ – అల్లు అర్జున్ రెడీ టు రూల్..