CM Revanth Reddy : వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దుద్యాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం, భక్తులతో కలిసి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం…