Site icon NTV Telugu

CM Revanth Reddy : కేసీఆర్ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేదని, SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు.. కమిషన్ కూడా రాదని కేసీఆర్.. హరీష్ పక్కన పెట్టారన్నారు. కేసీఆర్‌ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

Tollywood : డిసెంబర్ టార్గెట్ గా దూసుకొస్తున్న సినిమాల లిస్ట్ ఇదే

అంతేకాకుండా..’ 42km టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్ని పూర్తి చేస్తే.. ఆ కీర్తి కూడా తెలంగాణ కి దక్కుతుంది. పదేళ్లలో 5 వేల కోట్లు లిఫ్ట్ ల విద్యుత్ కి ఖర్చు చేశారు. కానీ రెండు వేల కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది. ఇప్పుడు 4600 కోట్లతో ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అవుతుంది. గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. నల్గొండ.. మహబూబ్ నగర్ కి తీవ్ర నష్టం చేశారు కేసీఆర్. కృష్ణ నది మీద కేసీఆర్ కూడా తెలంగాణ కి నష్టం చేశారు. ప్రాజెక్టులకి 1.86 వేల కోట్లు ఖర్చు చేశారు కేసీఆర్. కాళేశ్వరంకే లక్ష 20 వేల కోట్లు ఖర్చు చేశారు. పదేళ్లలో ప్రాజెక్టు లు పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటి మీద ఆంధ్రా అభ్యంతరం చెప్తుంది. ఏపీకి అలూసు ఐపోయింది. కార్మికులు చనిపోవడం బాధకరమైన అంశమే. మాక్కూడా ప్రాణం విలువ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండి.. ఆర్మీ సపోర్ట్ తీసుకున్నారు. నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నాం. బ్యాలెన్స్ టన్నెల్ 9.8 km ఉంది.

హరీష్ రావు.. చిల్లర మాటలు మానేయండి. SLBC మేము పూర్తి చేయకపోతే ప్రజలు మమల్ని క్షమిస్తారా..? SLBC పూర్తి చేయకపోతే.. మేము అధికారంలో ఉండి ఏం లాభం. పాలమూరు.. నల్గొండ ప్రజలు ఐక్యంగా ఉండండి. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఎదురుకోండి. టన్నెల్ బోర్ మిషన్ తీసేస్తున్నాం. ఏరియల్ సర్వే చేస్తే.. భూమిలో ఏముంది అనే డేటా వస్తుంది. అందుకు అనుగుణంగా పనులు.. అందుకే సర్వే.. కేసీఆర్ నీళ్లకు నడక నేర్పిన అంటున్నాడు కదా.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులే చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో.. కేసీఆర్ అదే చేశాడు. అంత దానికి కేసీఆర్ అవసరమా..? జరిగిన తప్పులు సరిదిద్దుతు ముందుకు వెళ్ళాలి. బీఆర్‌ఎస్‌నీ బొంద పెట్టినా బుద్ధి రాలేదు.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Jaipur Accident: జైపూర్‌లో మృత్యు ఘోష.. 10 మంది మృతి.. 40 మందికి తీవ్ర గాయాలు

Exit mobile version