CM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో షేర్‌కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను తాను నిర్వహించడం లేదన్న రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు కేవలం రెండు ట్విట్టర్ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానం పంపారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు.
Read also: Ponnam Prabhakar: ఐదేళ్లలో సిరిసిల్ల నేతన్నకు ఏం చేశావ్.. బండి సంజయ్ కు పొన్నం ప్రశ్న..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నకిలీ వీడియో షేర్ వెనుక నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను INC తెలంగాణ ట్విట్టర్ ఖాతాతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. CMO తెలంగాణ, సీఎం తన వ్యక్తిగత ఖాతాలను మాత్రమే ఉపయోగిస్తున్నట్లు లాయర్ సౌమ్య గుప్తా ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు లాయర్ సౌమ్య గుప్తా తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సామాజిక మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన గీతకి సీఆర్పీసీ 41 ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5 వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.
Read also: Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
కాంగ్రెస్ లీగల్ సెల్ ఇంఛార్జి రాం చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులకు రిప్లై ఇచ్చామన్నారు. సీఎం స్టార్ క్యాంపైనర్.. ఎన్నికల పనిలో ఉన్నారు కాబట్టి 15 రోజులు సమయం ఇవ్వండి అని ఆడిగామన్నారు. ఢిల్లీ పోలీసు లు ఇచ్చిన లింక్ లను వెరిఫై చేసేందుకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. గీత అనే వారియర్ ని మొబైల్ సీజ్ చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఓ వైపు నోటీసులు ఇచ్చారు.. మరో వైపు అరెస్ట్ లు అంటూ మండిపడ్డారు. ఇదేం పద్దతి.. బెదిరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించడంలో ఢిల్లీ పోలీసులు విఫలం అయ్యారని అన్నారు.
Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారు.. హరీష్ రావు ఆరోపణ