CM Revanth Reddy : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ భేటీలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైర్హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు వెలువడ్డాయి. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండటంతో ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్పీకర్ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ సమర్పించారు. కానీ ఎక్కువ మంది ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం వెనక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. అయితే.. ఫిరాయించిన ఎమ్మెల్యేల జాబితాలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) హాజరయ్యారు. కానీ కడియం శ్రీహరి మాత్రం ఈ భేటీకి రాకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!
