CM Revanth Reddy : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు. ప్రతి అంశంలో తొలుత స్పందించే చైతన్యం ఉన్న జిల్లా ఇది అని, కమ్యూనిస్టు సోదరులు కూడా మనతో అండగా నిలిచారు అని ఆయన అన్నారు.
ఈ సభలు ఎన్నికల కోసం కాదని స్పష్టం చేస్తూ, పేదల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి వేదికలు అవశ్యకమని ఆయన పేర్కొన్నారు. “పదేళ్లుగా ఇళ్ల కోసం పేదలు ఎదురుచూశారు. స్వంత ఇంటి కలను 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెరవేర్చారు. హనుమాన్ గుడి లేని ఊరు ఉండవచ్చు, కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం మాత్రం ఉండదు” అని సీఎం వ్యాఖ్యానించారు.
Vijayawada: మద్యం మత్తులో యువతితో గొడవ పడిన కానిస్టేబుల్.. అడ్డుకున్న మరో కానిస్టేబుల్…
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎటువంటి తప్పు జరుగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. “సమర్థుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు ఆయన్ని నడిపిస్తున్నాయి. ఈ శాఖలు నా వద్ద పెట్టుకోవచ్చు కానీ ప్రజల కోసం పొంగులేటి కి ఇచ్చాను” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పేదల పార్టీ అని మరోసారి పునరుద్ఘాటిస్తూ, “మేము పేదరికంలో పుట్టాం. పేదరికం ఏమిటో మాకు తెలుసు. పేదల కష్టాలు మాకు బాగా అర్థం” అని సీఎం అన్నారు. మరోవైపు, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ, “బీఆర్ఎస్ అనే పాములో కాలకుట్టిన విషం ఉంది. ఆ పామును చంపేశాం, మళ్లీ చూపాల్సిన అవసరం లేదు. వారు బంగళాలు, ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ మేము పేదలకు ఇళ్లు, సన్నబియ్యం ఇస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేసిన సీఎం, “IAS లు కావాలి, చదువుకోవాలి – ఇదే మా నినాదం. పేదల కళ్లల్లో ఆనందం చూడటమే మా నిజమైన సంపద” అని చెప్పారు. “ఒకనాడు జూబ్లీహిల్స్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం కన్నా, పేదరికంలో ఉన్నవారు స్వంత ఇల్లు పొందినప్పుడు వారి కళ్లల్లో కనిపించే సంతోషమే నాకు గొప్పది” అని ముఖ్యమంత్రి అన్నారు.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
