CM Revanth Reddy: డల్లాస్ లో సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీపై చర్చ..
- హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్..
- కొత్తగా టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్..
- డల్లాస్‌లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Also Read
హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.
Read also: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని డల్లాస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి, నేటి ప్రపంచంలో గాంధీ ఆశయాలు, బోధనల ఔచిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలు, పెట్టుబడులు కోరుతున్న అమెరికన్లతో సమావేశమయ్యారు. న్యూయార్క్ నుండి డల్లాస్ చేరుకున్నారు. టెక్సాస్‌లోని ప్రముఖ భారతీయులతో కలిసి సీఎం, మంత్రులు విగ్రహానికి పూలమాల వేసి స్థానికులతో కలిసి ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు.
Sajjanar: కండక్టర్ ను విధుల నుంచి అందుకే తొలంగించాం.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!