NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే మకాం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇవాళ ఉదయం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరుకావడంతో పాటుగా పార్టీ పెద్దలను కూడా రేవంత్‌ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నామినేటెడ్‌ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్‌ విస్తరణ లాంటి అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో వీలును బట్టి ఆయన చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.

Read also: Astrology: జూన్ 24, సోమవారం దినఫలాలు

దీనిపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి ఏఐసీసీ ముఖ్యనేతలు చర్చించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, పార్టీలో చేరిన వారి వాగ్దానాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించగా, కొన్ని జిల్లాలకు అస్సలు సీట్లు రాలేదు. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు ఎవరైనా వస్తే వారికి మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో విస్తరణ జరగవచ్చని సమాచారం.
What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?