CM Revanth Reddy : చిన్నారులకు నాణ్యమైన విద్య.. పోషకాహారం
- చిన్నారుల పోషకాహారం, విద్యపై సీఎం ఫోకస్
- ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ సూచనలు
- అంగన్‌వాడీల్లో ‘పోషణ సఖి’ ప్రతిపాదన
- స్కూల్ కాంప్లెక్స్‌లలో పైలట్ ప్రాజెక్ట్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర శాసనమండలి హాల్‌లో గురువారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0-10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టిక తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు.. ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన తెలియజేశారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను ఆయన సీఎంకు సూచించారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు వివరించారు.
Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
Also Read
అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. కార్తీక్ మురళీధరన్‌తో సమన్వయం చేసుకొని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సెర్ప్ సీఈవో దివ్య, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.
PM Modi: మోడీ కాన్ఫరెన్స్‌కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!
తాజావార్తలు
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!