CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- నిలంబూర్‌లో రేవంత్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
- రైతులు, బీసీల సంక్షేమానికి గుర్తింపు
- రూ.లక్ష నగదు.. ప్రశంసాపత్రం, జ్ఞాపిక
- కేసీ వేణుగోపాల్ స్మారక ఉపన్యాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఘనంగా అందుకున్నారు. కేరళ కాంగ్రెస్ దిగ్గజ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ‘ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఫౌండేషన్ ప్రతినిధులు , ఏఐసీసీ ముఖ్య నేతలు సస్కారపూర్వకంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం , జ్ఞాపికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ప్రజా సంక్షేమ పాలనకు దక్కిన గౌరవం
తెలంగాణ రాష్ట్రంలో రైతులు, వెనుకబడిన వర్గాలు (బీసీలు) , సామాన్య ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు, ఆయన కనబరుస్తున్న దూరదృష్టి గల పరిపాలనా వైఖరికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. ప్రజాస్వామిక విలువల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను, సమర్థవంతమైన నాయకత్వాన్ని అవార్డు ఎంపిక జ్యూరీ సభ్యులైన ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్ , ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ ప్రత్యేకంగా కొనియాడారు.
Also Read
- Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ కీలక నేతలు
దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రదానోత్సవ వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై స్మారక ఉపన్యాసం చేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలు అందించి కేరళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆర్యదాన్ ముహమ్మద్ పేరిట నెలకొల్పిన తొలి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి స్వీకరించడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!