Viral : సికింద్రాబాద్‌లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ బస్ స్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డు వెలసింది. ఈ బోర్డులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి A to Z అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండటం షాక్‌కి గురి చేసింది. ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
BLA Army: బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చే వరకు.. పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తాం..
వెంటనే రంగంలోకి దిగిన DRF (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీమ్ ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.