CM Revanth Reddy : నేనే రాజు, నేనే మంత్రి అన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ క్లారిటీ
- నేనే రాజు, నేనే మంత్రి అన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ క్లారిటీ
- నేనే సీఎం, నేనే మున్సిపల్ మంత్రిని అని చెప్పా
- మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు నాదే బాధ్యత అని చెప్పా
- కొందరికి ఇది అర్థమైనా స్వీకరించే గొప్ప మనసు వాళ్లకు లేదు
- 90 శాతం ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చాయి. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం , ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు. “నేనే రాజు.. నేనే మంత్రి” అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ఆ మాటలకు అసలు అర్థం బాధ్యత స్వీకరించడమేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో, ప్రజలు 90 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారని, ఇది తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గీటురాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని, కానీ పేదలు తనపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
IND vs PAK: పాకిస్థాన్ అంటేనే ఊగిపోతున్న హార్దిక్ పాండ్యా.. గణాంకాలు చూస్తే మతి పోవాల్సిందే!
Also Read
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
- TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
సామాజిక న్యాయం , దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా, నేడు అదే దళితుడిని అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే, నేడు అదే దళితుడిని ‘అధ్యక్షా’ అని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశమని కొనియాడారు. ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు 30 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే, నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంబీబీఎస్ సీట్లు అందుతున్నాయని, ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు.
రాబోయే 20 ఏళ్లు కూడా తాను పేదల కోసమే పని చేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కల అని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఉద్ఘాటించారు.
CM Revanth Reddy: 20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడాల పాత్ర అమూల్యం..
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!