CM KCR: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Wishes Ganesh Chaturthi To Telangana People: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి – జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడ్ని హిందువులు ఆరాధిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను ఈ పండుగ మనకు నేర్పుతుందని చెప్పారు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ.. శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్థించారు.
కాగా.. తెలంగాన రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా.. ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా.. ట్రాఫిక్ దగ్గర నుంచి ప్రజల దాకా, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అనుకోకుండా ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే.. అప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా సహాయక సిబ్బందుల్ని ఆయా ప్రధాన ప్రాంతాల్లో మోహరిస్తున్నారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!