Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్ కర్ణాటక ఈవెంట్‌తో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త ఇంటర్నేషనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, ఊహించని సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కంటే, రావణాసురుడి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్కే మేకర్స్ ఎక్కువ స్పేస్, విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చారన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు రామాయణంలో కథ మొత్తం రాముడి చుట్టూనే తిరగాలి. కానీ ట్రైలర్లో మాత్రం రణబీర్ కపూర్‌ను దాటుకుని యశ్ పాత్రే ఎక్కువగా డామినేట్ చేసినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బహుశా ఈ చిత్రానికి యశ్ స్వయంగా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం వల్లే మేకర్స్ ఆయనకు ఇంతలా ఓవర్ ఎలివేషన్ ఇచ్చారా అన్న అనుమానాలు సినీ ప్రియుల్లో బలపడుతున్నాయి.
గతంలో ‘టాక్సిక్’ సినిమా టైంలో యశ్ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయి సినిమా అంటూ కన్నడతో పాటు ఇంగ్లీష్ మార్కెట్‌ను టార్గెట్ చేసి, బడ్జెట్‌ను అడ్డగోలుగా పెంచేసి కేవీఎన్‌తో కలిసి అటు హీరోగానూ, ఇటు ప్రొడ్యూసర్‌గానూ భారీగా చేతులు కాల్చుకున్నాడు. దర్శకురాలి పనిలో అతిగా జోక్యం చేసుకుని అవుట్‌పుట్‌ను మార్చేయడం వల్లే ఆ సినిమా ఆడియన్స్‌కు విసుగు తెప్పించిందనే కామెంట్స్ వినిపించాయి. ఆ చేదు అనుభవం తర్వాత ‘రామాయణ’ విషయంలో దర్శకుడు నితీష్ తివారీ, మెయిన్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాలు మేకింగ్ లేదా డైరెక్షన్లో యశ్ వేలు పెట్టే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ మార్పులకు అవకాశం లేకపోయినా, ప్రమోషన్స్ కంటెంట్‌లో మాత్రం తన పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా ప్రొజెక్ట్ చేయించుకోవడంలో యశ్ సక్సెస్ అయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
ఈ రెండు భాగాల చిత్రానికి ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం, వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో యశ్ మాట్లాడుతూ విదేశాల్లో మన సినిమాకు గుర్తింపు రావాలంటే తక్కువ బడ్జెట్ అంటే ఎవరూ పట్టించుకోరని, అందుకే అంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నాడు. అయితే కంటెంట్ బాగుంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ఎలా ఆడుతుందో రాజమౌళి నిరూపించిన విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా, టైటిల్ పాత్ర పోషిస్తున్న రణబీర్‌ను పక్కనపెట్టి కేవలం విలన్ రోల్‌ను మాత్రమే ఇంతగా గ్లోరిఫై చేయడం రేపు థియేటర్లలో ఏ స్థాయి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!