Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Will Launches Bharat Rashtra Samithi Today In Hyderabad

BRS: చారిత్రాత్మక రోజు.. కొత్త చరిత్రకు శ్రీకారం.. టీఆర్ఎస్‌ ఇక బీఆర్ఎస్‌..

Published Date :December 9, 2022 , 7:59 am
By Sudhakar Ravula
BRS: చారిత్రాత్మక రోజు.. కొత్త చరిత్రకు శ్రీకారం.. టీఆర్ఎస్‌ ఇక బీఆర్ఎస్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్‌ 9వ తేదీ చాలా ప్రత్యేకమైనది.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అంటే 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లభించింది.. ఉవ్వెత్తున్న ఎగసిన ఉద్యమం ఓవైపు, ఆత్మబలిదానాలు మరోవైపు, ఉద్యమనేత కేసీఆర్‌ అకుంఠిత దీక్ష.. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం.. తెలంగాణపై ప్రకటన చేసింది.. ఉద్యమరూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన సందర్భం. ఉద్యమనేత, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నవంబర్‌ 29, 2009న ఆమరణ దీక్ష చేపట్టారు.. 11 రోజులపాటు ఆయన దీక్ష కొనసాగింది.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’.. అంటూ దీక్షకు దిగారు.. దీంతో, ఓవైపు విద్యార్థులు, మరోవైపు జేఏసీ.. వివిధ రాజకీయ పార్టీలు.. ఇలా అందరూ ఏకం కావడంతో.. చివరకు కేంద్రం తెలంగాణను ప్రకటించింది.. దీంతో.. డిసెంబర్‌ 9వ తేదీ తెలంగాణలో ఒక చారిత్రాత్మక దినంగా నిలిచింది.. అయితే, ఇవాళ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు గులాబీదళపతి, సీఎం కేసీఆర్..

Read Also: Airport Express Metro: నేడే సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన.. అప్పా పోలీసు అకాడమీ సభలో సీఎం ప్రసంగం

టీఆర్ఎస్‌ పార్టీ పేరును బీఆర్ఎస్‌ పార్టీగా మారుస్తూ.. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.. ఇక, దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. గురువారం రోజే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేందుకు అంగీకరిస్తూ ఎన్నికల కమిషన్‌ ఓ ప్రకటన జారీ చేసింది.. అయితే, ఇవాళ హైదరాబాద్‌ వేదికగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 1: 20 గంటలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కార్యక్రమం జరగబోతోంది.. తెలంగాణ భవన్‌ నుంచి బీఆర్ఎస్‌ అధికారిక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు.. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నారు.. మొత్తంగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే.. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌ పేరు బీఆర్ఎస్‌గా మారబోతోంది.

ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్‌.. ఇప్పుడు బీఆర్ఎస్‌గా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ పేరు మారుస్తూ తీర్మానం చేసిన రోజు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.. దేశ రాజకీయాల్లోకి అడుగు పెడదామా? నాతో వస్తారా? అంటూ ఏ సభ జరిగినా.. ప్రజల స్పందన తెలుసుకున్న కేసీఆర్.. ఆ తర్వాత పార్టీ పేరు మార్చారు.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. బీఆర్ఎస్‌ను అధికారికంగా ప్రారంభించబోతున్నారు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆయన పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.. దీని కోసం పార్టీ ప్రత్యేకంగా ఓ విమానాన్నే కొనుగోలు చేసేందుకు సిద్ధమైన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharat Rashtra Samithi
  • BRS
  • cm kcr
  • hyderabad
  • telangana

తాజావార్తలు

  • Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

  • Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions