CM KCR: నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన.. సత్తుపల్లి, ఇల్లందులో సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంతో ముందుకు సాగుతుంది. ఒకవైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. అధినేత మాత్రం రోజుకు రెండు, మూడు బహిరంగ సభలకు హాజరవుతూ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నారు. నేడు ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కల్లూరుకు చేరుకుంటారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సట్టచతెలన సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేశారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల ప్రచార సభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కేసీఆర్ ప్రకటిస్తారనే హామీల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తుపల్లి బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ సభకు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎంపీ వావిరాజు రవిచంద్ర విస్తృత ఏర్పాట్లు చేశారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమళ్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 20 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా.. ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగ సభలకు పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కల్లూరు సభా ప్రాంగణాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.
Israeli President: హమాస్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదు.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ స్పష్టం
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!