CM KCR Speech At Telangana Martyrs Memorial: అమరవీరుల్ని స్మరించుకునేందుకే ఈ అమరజ్యోతి అని.. గుండెల్లో నిలిచే విధంగా దీనిని నిర్మించుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చాలా పెద్దదని.. ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం.. ‘జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు’ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని.. అందులో భాగంగానే ఈ అమరజ్యోతి అని తెలిపారు. ఈ అమరజ్యోతిలో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని.. మొత్తం అమరవీరుల ఫోటోలను ప్రదర్శిస్తామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలనే ఉద్దేశంతో.. ఈ అమరజ్యోతి ప్రారంభాన్ని ఉత్సవాల చివరి దశలో పెట్టుకున్నామని తెలియజేశారు.
Project K: ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్ కు పండగే ?
రాష్ట్రాన్ని విలీనం చేసే చేసిన తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయని.. నాటి రోజుల్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక వచ్చిందని.. అక్కడి నుంచి మొదలుకొని 1965, 1966, 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్‌జీవోతో కొనసాగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఈ ఉద్యమంలో ఆసాంతం ఉన్నారన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు అనుభవించిన బాధలే ఇవాళ తెలంగాణ అని ఉద్ఘాటించారు. 1969లో జరిగిన ఉద్యమం కూడా ఎంతో కీలకమైనదని.. అప్పట్లో హింస జరిగిందని.. నాటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా ముందుకొచ్చి.. పోరాటం చేశారని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం కొంతమంది అమరుల కుటుంబాలు ఆదుకున్నామన్న ఆయన.. ఇంకా మిగిలిన వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Nellore Crime: పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి.. పోలీసుల వేధింపులే కారణమా..?
ఎవరు వచ్చినా అమరుల జ్యోతి దగ్గరకు రావాల్సిందేనని.. అంత అద్భుతంగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా.. అమరుల జ్యోతి చూసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇంత త్వరగా తెలంగాణ ప్రగతి జరుగుతుందని అనుకోలేదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం.. దేశం కంటే మనదే ఎక్కువన్నారు. పంజాబ్‌ని తలదన్నేలా పంట సాగు జరుగుతోందన్నారు. ఓ వైపు సెక్రటేరియట్.. ఎదురుగా అమరజ్యోతి ఉందన్న ఆయన.. ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా సిద్ధం అవుతోందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.