మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్నితీసుకురాబోతున్నట్లు సమాచారం. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 2,016 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే దీనికోసం రాష్ర్ట ఖజనాపై ఎంత భారం పడుతుందనే దానిపై సర్కార్ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్.. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
Read Also: ఏపీలో మూడు వేలు దాటిన కరోనా కేసులు
Also Read
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
రైతుబంధుతో ఇప్పటికే 50 వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు భీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేస్తోంది.రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయతీ నడుస్తున్న ఈ సమయంలో కొత్త పథకంతో మరోసారి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొవచ్చనే భావనతో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడులకు దిగుతోంది. దీంతో వారికి చెక్ పెట్టడంతో పాటు రైతులకు మేలు జరిగేలా ఈ పథకానికి వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఈ పథకం అమలైయితే చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఊరట లభించనుంది.
- Tags
- farmars
- kcr
- new scheme
- telangana
- TRS
తాజావార్తలు
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!