Site icon NTV Telugu

TRS Protest: గల్లీలో ముగిసింది.. ఇక ఢిల్లీలో పోరు.. కేసీఆర్‌ రైతు దీక్ష

Trs

Trs

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్‌ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా ఓకే పాలసి ఉండాలని డిమాండ్‌ చేస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు.. తెలంగాణ రైతుల పక్షాన హస్తినలో ప్రజా ప్రతినిధులు దీక్షకు పూనుకున్నారు.. దీక్షలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొనబోతున్నారు..

Read Also: New Cabinet: ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు.. వారికే అవకాశం..?

వడ్లను అడ్డుపెట్టుకొని అడ్డమైన రాజకీయాలకు చేసేందుకు బీజేపీని ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్‌ మండిపడుతోంది.. సీఎం కేసీఆర్‌ సహా యావత్తు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీ దీక్ష ద్వారా.. మేం బాయిల్డ్‌ రైస్‌ బాధితులం కాబోమంటూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఇప్పటికే నిరసన దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. దీక్ష పర్యవేక్షణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, పార్టీ శాసనసభ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పూర్తిచేశారు. పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేశారు. ఎండత తీవ్రత దృష్ట్యా.. దీక్షా స్థలి వద్ద కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు.. దీక్షకు వచ్చేవారందరికీ మజ్జిగ, మంచినీళ్లు, భోజనం ఏర్పాట్లు కూడా చేశారు..

Exit mobile version