Site icon NTV Telugu

Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోము..!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని, రోడ్డుపైకి వచ్చి ఆస్తులు కాపాడుకుంటామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, పంట నష్టంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు వినతిపత్రం అందజేశారు. వరద బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ తమిళిసైని కలిసిన మల్లు రవి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు. గవర్నర్‌ను కలిసిన అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరద నష్టాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టం గురించి తెలియజేసినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా విపత్తులు సంభవించినప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైంది.

Read also: Inorbit Mall: విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

ప్రజల కోసం పని చేయాల్సిన యంత్రాంగాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రజల ఆస్తి అని అన్నారు. ఆర్టీసీకి ఎన్నో ఆస్తులు సమకూర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. రోడ్డుపైకి వచ్చి ఆస్తులు కాపాడుకుంటామని హెచ్చరించారు. కాగా, సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులను డబ్బులు వెచ్చించి ప్రగతి భవన్‌కు రప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్ బాబు తమ నియోజకవర్గాలు వరదల వల్ల ధ్వంసమైనప్పుడు రెస్క్యూ టీమ్‌లను పంపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రాథమిక సాయం అందించడంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Exit mobile version