Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- 25 మందికి భారీ షాక్
- చెక్కు బౌన్స్‌తో వెలుగులోకి
- ఫిర్యాదుతో కదిలిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chit Fund Fraud : చిట్టీల పేరుతో దాదాపు 25 మంది నుండి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డ్ నివాసి నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చిట్టిల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాకేత్ లో నివసించే ఏ.వెంకటేశ్వర్లు అతని వద్ద పది లక్షల రూపాయల చిట్టి వేశాడు. దాదాపు 25 నెలలు క్రమం తప్పకుండా చీటీలు కట్టి, చిట్టి గడువు కూడా ముగియడంతో అతనికి రావాల్సిన రూ.20 లక్షలకు సంబంధించి చెక్కును ఇచ్చాడు. చిట్టిల వ్యాపారి నల్ల రమేష్ ఇచ్చిన సదరు చెక్కు బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది.
Also Read
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ఏళ్లు గడుస్తున్న అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు వెంకటేశ్వర్లు గత జులై నెల 7వ తేదీన జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల సంఖ్య పెరగడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కం 10వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నల్ల రమేష్ ను హాజరు పరిచారు. ఈనెల 27న న్యాయమూర్తి నిందితుడు రమేష్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. నల్ల రమేష్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!