తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్ 370 రద్దు చేశామని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పథకాలు తెచ్చినప్పటికీ తెలంగాణలో కేసీఆర్ వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. మరోవైపు.. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన రమణ్ సింగ్.. రాష్ట్రంలో ఒక లక్షా 35 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయటం లేదని మండిపడ్డారు.. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు రమణ్‌సింగ్.
కేసీఆర్ పాలన పోవాలి-ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం పిలుపు
