Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cheddi Gang In Mahabubnagar

Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

Published Date :January 20, 2023 , 10:32 am
By NTV WebDesk
Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. బృందావన్ కాలనిలో వరుస దొంగ తనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు. గతంలో కూడా అదే కాలనిలో చోరీకి చెడ్డి గ్యాంగ్ విఫలయత్నం కావడంతో వెనుతిరిగారు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బులు, నగలు దొంగతాలకు పాల్పడుతుండటంతో మహబూబ్ నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేయాలంటేనే జంకుగుతున్నరు. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ తనానికి వచ్చిన చెడ్డి గ్యాంగ్ వీడియో లు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.

గత ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌

గత ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో సంగారెడ్డి,రంగా రెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరించడం కలకలం రేపింది. మీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. కాగా.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం కలకలం రేపింది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మై హోం వెంచర్‌లో ఓ ఇంటి సమీపంలో నలుగురు సభ్యులు ఉన్న ముఠా చేతిలో మారణ ఆయుధాలతో సంచరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు చెడ్డి గ్యాంగ్ ల ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు మళ్లీ మహబూబ్‌ నగర్‌ లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌ చేస్తుండటంతో.. బాబోయ్‌ మళ్లీ వచ్చారంటూ ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.

వరుస దొంగతనాలు..

జనవరి 15 జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తండ్రియాల బ్రాంచ్ ఏటీఎమ్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూతవేటులోనే ఉన్న ఏటీఎం సెంటర్ లో జరగడం కలకలం రేపింది. ముందస్తు ప్లాన్‌ వేసుకున్నా దుండగులు సీసీ కెమెరాలను మూసివేసేసి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో వారి పని సులువుగా కానించారు. మెల్లగా బయటకు పరారవుదామనుకునే లోపే అక్కడున్న స్థానికులు వారిని గమనించి పోట్రోలింగ్‌ పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్‌ చేసి అదుపులో తీసుకున్నారు.

జనవరి 13 న ఎల్‌బినగర్‌

తాజాగా.. ఎల్‌బినగర్‌లో చైన్‌ స్నాచర్లు తెగబడ్డారు. బ్యాగును భుజాన వేసుకుని వెళుతున్న 50ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్‌ చేశారు. వారి ఎదురుగా వెళుతూ తన మెడలో గొలుసు వుందని గమనించారు. కారు పక్కన బైక్‌ ఆపి ఆమె మెడలో వున్న బంగారం గొలుసును తెంచుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు తులాల బంగారం గొలుసు తెంపుకెళ్లారని వాపోయింది. ఎల్.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్‌ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జనవరి 8 సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో
సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్‌ చల్‌ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గంటల వ్యవధిలో 6 చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌, ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది.
Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aminpur
  • Cheddi Gang
  • Cheddi gang in Mahabubnagar
  • Gold Robbery
  • hyderabad

తాజావార్తలు

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions