Challenge of MLAs: దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు, రేపు హోలీ జరుపుకోవడంతో అంతా కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రజలు వసంతాన్ని స్వాగతించడానికి రంగులు, ఆనందంతో హోలీ ఆడతారు. యువకులు, వృద్ధులు, పేదలు, ధనికులు అందరూ కలిసి పండుగను జరుపుకుంటున్నారు. దేశమంతా రంగులతో ఆనందాలకేలి హోలీ చేసుకుంటూ సంబరాల్లో తేలుతుంటే నల్గొండ జిల్లాలో మాజీ, తాజా ఎమ్మెల్యేల మధ్య హోలీ తంటా తెచ్చిపెట్టింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు నడిబొడ్డున సెంటర్లో సవాల్ విసురుకోవడం ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావతరణం నెలకొంది.
Read alsso:Dubai Dirham: ఏంట్రా మీరు మారరా? పట్టుకుంటున్నా పదే పదే అదేపని చేస్తారేంట్రా?
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యేల మధ్య హోలీ సంబరాలు ఆధిపత్య పోరుకు కారణమయ్యాయి. ఇద్దరు నేతలు హోలీ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తాజా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు, అభిమానులు నకిరేకల్ సెంటర్ కు భారీగా చేరుకున్నారు. పోటాపోటీగా జన సమీకరణ, డీజేలతో ర్యాలీగా వెళ్తున్న క్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి డ్రైవర్ మీ మీసం మెలేసి.. తొడగొట్టి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ చేయడంతో…. ఒక్కసారిగా నకిరేకల్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది.. రియాక్ట్ అయిన వేముల వీరేశం కార్యకర్తల భుజాలపైకి ఎక్కి ప్రతి సవాల్ చేయడంతో వీరేశం చిరుమర్తి లింగయ్య ల అనుచరులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ర్యాలీ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేముల వీరేశంపై నేరుగా ఫైర్ అయ్యారు.
Read also: Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..
ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గంలో చేసిన పనులకు ప్రజలు బుద్ధి చెప్పారని వీరేశాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. ప్రజలందరూ వీరేశం తొడ కొట్టడాన్ని మీసం మేలయ్యడని చూశారని సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలలో కూడా రికార్డు అయిందని, దీనిపై ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారని తెలిపారు. ఉద్రిక్తతకు కారణమైన వీరేశంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొనడంతో నకిరేకల్ నియోజకవర్గ అధికార బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందన్న టాక్ వినిపిస్తుంది. హోలీ రోజు ఎమ్మెల్యేలు అందరితో కలిసిమెలిసి ప్రజలతో ఆనందాన్ని నింపాలి గాని ఇలా ఉద్రిక్తత పరిస్థితులు తేవడం ఏంటని మండిపడుతున్నారు. ఏది ఏం జరిగినా బీఆర్‌ఎస్ లో మాత్రం ఆధిపత్య పోరు షురూ అయ్యిందని దీనిపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.
Minitser KTR Live: సీఐఐ తెలంగాణ సమావేశంలో కేటీఆర్ లైవ్