Site icon NTV Telugu

Lok Sabha Elections: నామినేషన్ పత్రాల్లో లెటెస్ట్ ఫోటోలు పెట్టండి లేదంటే రిజెక్ట్ చేస్తాం.. సీఈసీ సూచన

Ceo Telangana

Ceo Telangana

Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్ పత్రాల్లో లేటెస్ట్ ఫోటోలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. లేకుంటే నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ఫారం, అఫిడవిట్‌ను జాగ్రత్తగా నింపాలని తెలిపారు. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.

Read also: Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్‌ శర్మ

జాగ్రత్తగా అఫిడవిట్, నామినేషన్ పత్రాలు పూర్తి చేయాలన్నారు. ఫాం-1లో ప్రదేశం ఎక్కడ రాస్తారో అక్కడి ఆర్వోకి అందజేయాలని సూచించారు. అదే నియోజకవర్గంకు చెందిన 10 మంది ప్రపోజల్స్ సంతకాలు, వివరాలు ఉండాలని తెలిపారు. ఫా-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని చెప్పారు. అభ్యర్థులు తాజా పాప్ పోర్ట్ సైజ్ 5 ఫోటోలు జత పర్చాలని.. గతంలో బ్యాలెట్ పత్రాల్లో తమ ఫోటో సక్రమంగా ముద్రించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనిఫాంతో ఉన్న, క్యాప్, రంగుల కళ్ళజోడుతో ఉన్న ఫోటోలు, పాత ఫోటోలు కాకుండా ఇప్పటి (లేటెస్ట్) ఫోటు ఉండాలని తెలిపారు. పాత ఫోటోలు పెడితే చెల్లవని రిజెక్ట్ చేస్తామని అన్నారు. అభ్యర్థి ఖచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాలని చెప్పారు.

Read also: Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..

అఫిడవిట్ లో ఏ కాలంను ఖాళీగా పెట్టొద్దని, అందుకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుందని వికాస్ రాజ్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 17 నియోజకవర్గాల్లో 42 మంది 48 నామినేషన్లు దాఖలు చేసారు.. 5, 7048 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి.. 19 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నికల విధుల్లో నిమగ్నమైయ్యాయి. ఇప్పటి వరకు 60 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి.. మరో 100 కంపెనీల పోలీసు బలగాలు త్వరలో రాష్టానికి వస్తాయి.. వివిధ రాష్ట్రాల నుంచి 12 వేల మంది పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు.. మరో 16 వేల మంది త్వరలో రాష్ట్రానికి వస్తారని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..

Exit mobile version