TRS Turns BRS: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. సీఈసీ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Election Commission Approved TRS As BRS: అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడం.. మరుసటి రోజే ఆ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే! ఇన్ని రోజులపాటు ఈ తీర్మానం విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచిన సీఈసీ.. ఎట్టకేలకు ఈరోజు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేసీఆర్‌కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. ఈ నేపథ్యంలో.. రేపు (డిసెంబర్ 9) శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితిఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చారు.
V Hanumantha Rao: సజ్జల వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్.. ఏపీ, తెలంగాణ కలిపే పని కాదు
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఈ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ భవన్‌లో 1:20 గంటలకు తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా కేసీఆర్ సంతకం చేసి, ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం కేసిఆర్ బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని సీఎం కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు కూడా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఇక జాతీయ పార్టీగా అవతరించింది కాబట్టి.. ఇకపై సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గొననున్నారని తెలుస్తోంది.
Pawan Kalyan: అన్నా.. నీకు దండం పెడతాం.. ఆ పని మాత్రం చేయకు
కాగా.. అక్టోబర్ 5న సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే! తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ECI accepts the change in the name of 'Telangana Rashtra Samithi' (TRS) to 'Bharat Rashtra Samithi'. pic.twitter.com/VZgDptxVvZ
— ANI (@ANI) December 8, 2022
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!