NTV Telugu Site icon

CBI No Reply To MLC Kavitha: ఈ రోజు కుదరదన్న కవిత.. సీబీఐపై నిర్ణయంపై సస్పెన్స్‌..!

Cbi

Cbi

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కలిసే విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం సీఆర్‌పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్‌ 6వ తేదీన అంటే ఈరోజు తమను కలవాలని.. ఢిల్లీలోనైనా సరే.. హైదరాబాద్‌లోనైనా సరే అని పేర్కొంది సీబీఐ.. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్‌ఏ రాసిన లేఖ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీని కూడా తనకు వీలైనంత త్వరగా తనకు పంపాలని కోరారు.. దీనిపై స్పందించిన సీబీఐ.. వెబ్‌సైట్‌లో ఉంచామని రిప్లై ఇవ్వడంతో.. సోమవారం రోజు మరోసారి సీబీఐకి లేఖరాశారు కవిత.. సీబీఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేదంటూ లేఖలో పేర్కొన్నారు… ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదన్న ఆమె.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సీబీఐ అధికారులను కలవలేనని స్పష్టం చేశారు..

Read Also: IT Raids on Devineni Avinash: విజయవాడలో ఐటీ దాడుల కలకలం.. దేవినేని అవినాష్‌ ఇంట్లో సోదాలు

ఇదే సమయంలో.. సీబీఐ అధికారులకు కొత్త తేదీలను సూచించారు ఎమ్మెల్సీ కవిత.. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఇక, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని స్పష్టం చేశారు.. అయితే, దీనిపై ఇప్పటి వరకు సీబీఐ నుంచి ఎలాంటి స్పందనలేదు.. మంగళవారం ఉదయం 11 గంటలకు తమను కలవాల్సింది 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన తేదీల్లో ఏదైనా ఒకటి ఫైనల్‌ చేస్తారా? లేదా? వారి నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది.. అయితే, ఇవాళ ఉదయం 11 గంటల వరకే హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండనున్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ.. ఆ తర్వాత జగిత్యాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. బుధవారం రాత్రి మళ్లీ హైదరాబాద్‌ చేరుకోనున్నారు ఆమె.. రేపు సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో.. ఇవాళ, రేపు అక్కడే ఉండబోతున్నారు.. అయితే, 24 గంటలు గడిచిన సీబీఐ నుంచి కల్వకుంట్ల కవితకు సీబీఐ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో.. సీబీఐ-కవిత భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Show comments