Cannabis in Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. రూ.11 లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయి సీజ్ చేసింది. గంజాయి ని బ్రౌన్ కలర్ ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసిన ఆటోలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీ ఉన్నారు. పాత బస్తీ కి చెందిన మహ్మద్ అయాన్, మహ్మద్ మొయినుద్దీన్, దీపక్ పటేల్ పై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఒరిస్సా కు చెందిన దీపక్ పాటిల్ గంజాయిని భద్రాచలం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సుమారు 30 కేజీల గంజాయిని ఆటో ట్రాలీ లో హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీపక్ పాటిల్, స్నేహితుడు మొయినుద్దీన్ కలిసి పోలీసులకు చిక్కకుండా బైక్ పై పెట్రోలింగ్ చేశారు. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం అక్కడ మాటు వేసి పట్టుకున్నారు. చిన్న చిన్న ప్యాకెట్స్ లో గంజాయి ప్యాకింగ్ చేసి హైదరాబాద్ లో విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిందితుల నుండి 30 కేజీల గంజాయి, అటో, బైక్ తో పాటు 2 మొబైల్ సీజ్ చేశారు.
Read also: CSK vs GT Dream11 Prediction: చెన్నై, గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
మరోవైపు వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కేసులో నలుగురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. సయ్యద్ ఉజెఫ్ అనే వ్యక్తి తన శత్రువు అయిన ముషారఫ్ జైలుకు పంపాలని ఉద్దేశంతో ముషారఫ్ కారులో 207 గ్రాముల గంజాయిని పెట్టి సయ్యద్ ఉజెఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కారు ఓనర్ ముషారఫ్ ను అదుపులో తీసుకుని విచారించారు. తనకు గంజాయితో ఎలాంటి సంబంధం లేదన్న ముషారఫ్ తెలిపారు. సీసీ కెమెరాలు కెమెరాల్లో కారు చుట్టుపక్కల తిరుగుతున్న దృశ్యాలను గమనించి అతన్ని అదుపులో విచారించారు పోలీసులు. తన స్నేహితుని తానే ఉద్దేశపూర్వకంగా గంజాయి పెట్టడం ఇరికిద్దామని ఆలోచనతో గంజాయి పెట్టినట్లు సయ్యద్ ముజేఫ్ పోలీసులు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి తెచ్చాడనే విషయంపై విచారించడంతో అతనికి మరో ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Pragya Jaiswal : అందాలతో మైమరిపిస్తున్న ప్రగ్య జైస్వాల్ …