MMTS Services Cancelled: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నేడు నగరం MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
రద్దు చేసిన ఎంఎంటీఎస్..
* లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 6 సర్వీసులు,
* ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 5 సర్వీసులు,
* హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 3 సర్వీసులు ఉన్నాయి.
* అలాగే లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు,
* ఫలక్‌నుమా-రామచంద్రపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్, రామచంద్రపురం-ఫలక్‌నుమా మార్గాల్లో ఒక సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Read also: Foreign Currency: ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు షాక్.. కాటన్ బాక్స్‌ను పరిశీలించగా..
పలు రూట్లలో ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ సహకరించాలని కోరారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వీసులను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశామని, రేపటి నుంచి యథావిధిగా అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులందరూ తమకు సహకరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రజలు మెట్రో, బస్సులను ఆశ్రయిస్తున్నారు.
Read also: Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి
అయితే తాజాగా…ఈనెల 7వ తేదీ పలు నిర్వహణ సమస్యల కారణంగా పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 17 సర్వీసులను రద్దు చేశారు. లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – ఫలక్‌నుమా మార్గంలో 6 సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం మార్గంలో ఒక సర్వీసు, ఫలక్‌నుమా-హైదరాబాద్ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేశారు. సాధారణ ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్