హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నేడు నగరం MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.