Loan App Harassment: తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న శీలం మనోజ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. ఇక ఈఎంఐ కట్టాల్సి ఉండగా.. మనోజ్ ఈఎంఐ చెల్లించలేక పోయాడు. దీంతో.. రంగంలోకి లోన్ యాప్ ఏజెంట్లు దిగారు. మనోజ్ ను ఈఎంఐ చెల్లించాలని వేధించడం మొదలుపెట్టారు. ఈఎంఐ కట్టడానికి కాస్త లేట్ అవుతుందని చెప్పినా ఎజెంట్లు మనోజ్ మాటలు పట్టించుకోలేదు. మనోజ్ సబంధించిన బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఫోన్ చేశారు. మనోజ్ ఈఎంఐ చెల్లించాలని ఈఎంఐ టైం అయిపోయిందని డబ్బులు కట్టమంటే కట్టడంలేదంటూ ఫోన్ తెలిపారు.
Read also: Shrutii Marrathe : ‘దేవర’ సెట్ లోకి వచ్చేసిన మరాఠి బ్యూటీ..
దీంతో బంధువులు, పేరెంట్స్, స్నేహితుల వద్ద నుంచి మనోజ్ కు అడిగారు.. ఈనేపథ్యంలో మనస్తాపం చెందిన మనోజ్ అందరిముందు పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మనోజ్ రూం వద్దకు వెళ్లి స్నేహితులకు షాక్ తగిలింది. మనోజ్ రూంలో విగతజీవిగా పడివుండటంతో కాలేజీ యాజమాన్యానికి విషయం తెలిపారు. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన పోలీసులు దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజీకి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. మనోజ్ స్వస్థలం కొత్తగూడెం గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడంతో మనోజ్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు చదువుకుని వాళ్లకు పెద్దదిక్కుగా ఉంటాడని అనుకుంటే ఇలా జరుగుతుందని ఊహించలేదని వాపోయారు.
Aksha Pardasany : పెళ్లి పీటలు ఎక్కిన తెలుగు హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..