టాలీవుడ్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయ్యింది..టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అక్ష పార్ధసాని పెళ్లి చేసుకుంది.. ఈ అమ్మడు యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. అయితే గత ఏడేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రాకపోడంతో తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు..
ఈ ముంబై భామ అక్కడే బాలీవుడ్ లో ఉంటూ అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. తాజాగా హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి తాజాగా ఫిబ్రవరి 26 న పెళ్లి చేసుకున్నారు.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది..గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల మధ్యే ఈ వివాహం జరిగింది.
పెళ్లి ఫోటోలని అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అయితే ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు ఎంట్రీ ఫన్నీగా ఉండటంతో ఈ పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. పెళ్లి కొడుకులు గుర్రం లేదా కార్ లేదా రథం లాంటి వాటిల్లో కూర్చోపెట్టి ఊరేగింపుగా వస్తారు. అయితే కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్స్ కి వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వగా.. కెమెరామెన్ అనిపించుకున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్ష, కౌశల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..