Vinod Kumar: మేడిగడ్డ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. గంగ నుండి కావేరీ వరకి నదులని అనుసంధానం ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. నీటి పంపకాలు ఇంకా జరగలేదన్నారు. గోదావరినదిలో తెలంగాణ వాటా సంగతి ఏమిటి? ఇచ్చంపల్లి వద్ద డ్యాం కట్టుతామంటే మేము అడ్డుకున్నామన్నారు. నలుగురు బీజేపీ ఎంపీల స్పందన ఏమిటన్నారు. 1985లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు పై ఎన్టీఅర్ హయంలో సర్వే చేసారన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుని చత్తీస్ ఘడ్ వ్యతిరేకించిందన్నారు. గంగ నుండి మహానదికి ఇంకా సర్వేనే జరుగలేదన్నారు.
Read also: Mumbai Airport: నూడుల్స్‌లో బంగారం, వజ్రాలు.. నలుగురు అరెస్ట్
గోదావరి నీటి ని కృష్ణాకి, కృష్ణా నుండి కావేరీ కి నీటిని ఎలా తరలిస్తారని తెలిపారు. తెలంగాణ రాచ్ట్రానికి డిపిఆర్ లేఖ కేంద్రం పంపిందన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకి గోదావరి నీరే దిక్కు.ఇప్పుడు ఆ నీటినే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చంపల్లి నుండి తమిళనాడు కి నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అభ్యర్థి బండిసంజయ్ కి ఇచ్చంఒల్లి పై అవగాహాన ఉందా? అని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ మిగులు జాలాలు అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే అని చెప్పిందన్నారు. కేసీఆర్ దూరదృష్టి తోనే అదనపు టీఎంసీ కోసం వరుదకాలువ నిర్మాణం చేపట్టారన్నారు. తెలంగాణ వాటా తేలిపోయే వరకి ఇంటర్ లింక్ రివర్ లని వాయిదా వేయాలన్నారు. ఎన్నికల సమయంలొ ఎవ్వరికి తెలియవద్దని ఎంఓయూ పంపారన్నారు.
Read also: TS Inter Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చంపల్లి నీటి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమ్మక్క, సారక్క ప్రాజెక్టు కొసం దరఖాస్తు చేస్తే రెండెళ్ళ నుండి అడుగుతున్న అనుమతులు ఇవ్వడం లేదన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్రాజెక్టు గురించి అడిగారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ని బదనాం చేయడానికి మేడిగడ్డ డ్రామాలు అడారు కాంగ్రెస్ వారన్నారు. మేడిగడ్ఢ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదన్నారు. కేసీఆర్ గెలిస్తే కాపర్ డ్యాం కట్టి నీటిని ఎత్తిపోసి నీటిని అందించేవారన్నారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వలన నీరంతా క్రిందకి వదిలారన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పై బీజేపీ అభ్యర్థి స్పందించాలన్నారు. మేము కట్టిన ప్రాజెక్టుల పేర్లు అన్నీ హిందు దేవుళ్ళ పేర్లే.. బండిసంజయ్ మాకు దేవుళ్ళ గురించి చెప్పేవాడు అయ్యిండా? అని మండిపడ్డారు. ధర్మం అని చెప్పే బండిసంజయ్ ఆయన ధర్మం నిర్వర్తించాలన్నారు.
TS Inter Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..