Site icon NTV Telugu

Kavitha: దోచుకోవడానికే మూసీ ప్రాజెక్ట్ చేపట్టినట్లుంది

Kavitha

Kavitha

పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు చిన్న భాగానికే రూ.4100 కోట్లు అయితే మొత్తం ప్రాజెక్ట్‌కు ఎంత అవుతుంది…? అని నిలదీశారు. ప్రిలిమినరి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం.. మూసీ ప్రాజెక్ట్ కమర్షియలైజేషన్ కోసమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఇది కూాడా చదవండి: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వాటికి లైన్‌ క్లియర్‌

శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి మూసీ ప్రాజెక్ట్‌పై వరల్డ్ బ్యాంక్ రుణాలపై స్పష్టం చేశారన్నారు. రేవంత్ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లినట్లుగా ఒప్పుకున్నారని తెలుస్తుందన్నారు. ప్రివిలేజ్ మోషన్‌కి మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పారని.. కేవలం సివారేజ్ లైన్ కోసం రూ.4100 కావాలని అడిగినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. కానీ ప్రిలిమినరి ప్రాజెక్టు రిపోర్ట్‌లో ఏముందో చెప్పేందుకు మాత్రం దాచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్రీధర్‌బాబు గారడీ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూాడా చదవండి: KTR: ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..

Exit mobile version