Site icon NTV Telugu

BRS Party: దానం పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

Padi Koushik Reddy

Padi Koushik Reddy

BRS Party: ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడని గుర్తు చేశారు. అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా? అని ప్రశ్నిస్తారు.

Read also: PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం..

మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని తెలిపారు. మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందుకు వేస్తామన్నారు. ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు. మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఐదేళ్లు మేము ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండొచ్చు.. కాంగ్రెస్ లో జరిగే అంతర్గత కలహాలకు మేము భాద్యులం కామని క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం, నల్లగొండ కాంగ్రెస్ బాంబులు ఎపుడైనా పేలోచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం..

Exit mobile version