Site icon NTV Telugu

BRS MLA Aroori Ramesh: సైకో లెక్క బండి సంజయ్‌.. పిచ్చోడి లెక్క రేవంత్‌ రెడ్డి

Brs Mla Aroori Ramesh

Brs Mla Aroori Ramesh

Aroori Ramesh: అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సుంకే రవిశంకర్, దుర్గయ్య చిన్నయ్య బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణకు తలమానికంగా దేశములో ఎక్కడా లేనివిధంగా బ్రహ్మాండమైన సచివాలయం నిర్మించి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టామన్నారు. దాని కూలగొడత అన్న బండి సంజయ్ ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చారించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబెడ్కర్ అంటే ఏ మాత్రం గౌరవము లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిచ్చోడి లెక్క, సైకో లెక్క మాట్లాడుతున్న బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రగతి భవన్ పగులగొడుత అని ఇంకో పిచ్చోడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు కాబట్టే మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు.

Read also: Kishan reddy: బంగారు తెలంగాణ అన్నారు.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో నూతన సెక్రెటరియట్ కి డా.బీఆర్ అంబెడ్కర్ పెరు పెట్టుకుంటే బండి సంజయ్ కి కళ్ళు మండుతున్నాయన్నారు. దళిత వ్యతిరేకి బండి సంజయ్ అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి లేదంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ కి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచిస్తే దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సెక్రెటరియట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తి. దీన్ని కులగొడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరంటూ మండిపడ్డారు. మాయమాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బండి సంజయ్,రేవంత్ రెడ్డి పబ్బం గడుపు కోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక్కడ అడ్రెస్ లేదు ఫ్రస్టేషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఇద్దరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఇద్దరిని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ప్రజలకు బేషరత్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. బండా ప్రకాష్ నామినేషన్

Exit mobile version