NTV Telugu Site icon

KTR : కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్‌.. కీలక అంశాలపై చర్చ

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేయనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో కోర్టులో పోరాడతామని, తమ పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అంతేగాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ విద్యా వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారత పౌరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగలగడం దేశంలోని విశ్వవిద్యాలయాల మూలంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనల్లో చేయనున్న మార్పులపై తమ అభ్యంతరాలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించామని తెలిపారు.

IND vs ENG: టీం నుండి కోహ్లీ, పంత్ అవుట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్‌

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన సర్చ్ కమిటీల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌కి అప్పగించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, “నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్” అనే నిబంధన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నియామకాన్ని తప్పించుకునే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రమాదం ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో నియామక ప్రక్రియ విద్యార్హతలే కాకుండా పరిశోధనలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఇక, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 365-బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారి 63కి కలిపేలా విస్తరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!